బుల్లితెరపై సందడికి రెడీ అయ్యిన భారీ హిట్ “కార్తికేయ 2”?

Karthikeya 2 movie review

ఈ ఏడాది టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా మంచి హిట్ అయ్యిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కించిన ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం “కార్తికేయ 2” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం అయితే తెలుగు సహా హిందీ భాషల్లో రిలీజ్ ఒక మాజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో ఈ చిత్రం విజయం తెలుగు సినిమా నాట ఓ అద్భుతమైన విజయం గా నమోదు కాగా నిఖిల్ కూడా తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాని అందుకుని అరుదైన రికార్డు అందుకున్నాడు.

ఇక ఈ చిత్రం అయితే నెక్స్ట్ ఓటిటి లో కూడా వచ్చి భారీ హిట్ కాగా ఫైనల్ గా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. మరి ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థే కొనుగోలు చేయగా తెలుగు వెర్షన్ లో జీ తెలుగు వారు డేట్ ని లాక్ చేశారు.

మరి ఈ నవంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ టీవిలో కన్ఫర్మ్ చేస్తుండగా సోషల్ మీడియాలో ఇంకా అనౌన్సమెంట్ రావాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాలో అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కాల భైరవ సంగీతం అందించాడు.