Nirupam Paritala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్న నటుడు నిరుపమ్. తెలుగులో చంద్రముఖి, మూగ మనసులు, కాంచన గంగ వంటి సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ఎంత మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అలాగే తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు సృష్టించిన సీరియల్ కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు గా నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు గా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. బుల్లితెరపై నిరుపమ్ పరిటాల తెలియని ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నిరుపమ్ పరిటాల సీరియల్స్ లో నటించే సహా నటి అయినా మంజుల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి బుల్లితెర ఫై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ నటించారు. ఇటీవలే ఈ జంట సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. ఇక యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ జంట పలు వీడియోలు తీస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ మొత్తం నిరుపమ్ పరిటాల తన భార్య మంజుల అప్పగించాడు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిరుపమ్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాకు ఇష్టమైన హీరో వెంకటేష్.. ఆయనతో సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.. అంతేకాకుండా సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఒకటి రెండు సినిమా ప్రపోజ్ లు ఉన్నాయి. అయితే ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు అని తెలిపారు. అయితే ఇప్పటి వరకు నన్ను సీరియల్ డాక్టర్ బాబుగా, హిట్లర్ గా చూసిన జనం ఒక్కసారిగా సినిమాలో చూస్తే దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ప్రశ్న సినిమా తీసే వారికి అలాగే.. నటించే నాకు కూడా డౌట్ వస్తోంది.. అందుకే ఏదైనా సేఫ్ గేమ్ ఆడాలి అని తెలిపాడు నిరుపమ్. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. డాక్టర్ బాబు క్యారెక్టర్ నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాడమే కాకుండా.. పలు యాడ్స్ కూడా వస్తున్నాయి.