Kamal Haasan: కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే థగ్ లైఫ్ సినిమా బ్యాన్.. భారీ షాకిచ్చిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు!

Kamal Haasan: స్టార్ హీరో, నటుడు కమల్ హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ చేసిన వాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. కన్నడిగులు ప్రస్తుతం కమల్ హాసన్ పై పంది పడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఈ విషయంపై స్పందించి తను అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు అని వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం తగ్గడం లేదు.

ఆయన తీరుపై కర్ణాటక ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని లేదంటే ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేస్తామని అన్నారు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నరసింహులు. ఈ విషయంపై కమల్ హాసన్ ను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మరోవైపు థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించకూడదనే చర్చ సైతం తెరపైకి వచ్చిందని అన్నారు. కాగా ఈ సందర్బంగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ.. కమల్ హాసన్ ను సంప్రదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మేము ఇప్పటికే తమిళ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిని సంప్రదించాము. ఈ విషయానికి ఈ రోజు మెయిల్ సైతం పంపిస్తాము. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టము. కమల్ హాసన్ క్షమాపణ చెప్పే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టము. కమల్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈనెల 30 వరకు కమల్ క్షమాపణ చెప్పకపోతే చిత్ర విడుదలను అడ్డుకుంటాము. ఎన్నో సంస్థలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై మేము సమావేశం అయ్యి కమల్ తప్పుగా మాట్లాడరనే అభిప్రాయానికి వచ్చాము. ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని అన్నారు. మరి ఈ వివాదం పై కమల్ హాసన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.