“విక్రమ్” వసూళ్ల సునామి..నెక్స్ట్ ఈ క్లబ్ లో జాయిన్ అవ్వడం ఖాయం అట.!

ఈ ఏడాది తమిళ సినిమా సినిమా నుంచి వచ్చి భారీ హిట్ గా నిలిచిన అతి కొద్ది సినిమాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన భారీ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. ఈ సినిమా అయితే అక్కడ ఏకంగా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అయితే వసూళ్ల సునామి సృష్టించింది అని చెప్పాలి. రీసెంట్ గానే 350 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి 380 కోట్లకి చేరుకోగా ఈ వసూళ్ల మార్క్ అయితే ఇక్కడితో ఆగదని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీనితో అయితే ఈ చిత్రం డెఫినెట్ గా 400 కోట్ల వసూళ్ల మార్క్ ని క్రాస్ చేయడం పక్కా అని తెలుస్తుంది. 

దీనితో అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లేకుండా ఈ మార్క్ ని అందుకున్న ఫస్ట్ సినిమాగా ఇది నిలుస్తుంది. అయితే ఈ ఇక్కడ సక్సెస్ అని ఎందుకు అనలేదు అంటే హిందీలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుని ఉంటే చెప్పి ఉండొచ్చు. 

మొత్తానికి అయితే ఈ సినిమా ఇలాంటి వసూళ్లతో అదిరే లాభాలను అందించింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించారు.