ఓటిటిలో “విక్రమ్” కాస్త ముందే వచ్చేస్తుందా..?

ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “విక్రమ్” ఇంకా బాక్సాఫీస్ దగ్గర రోర్ చేస్తుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అలాగే సూర్య లాంటి స్టార్స్ నటించగా లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహించాడు. మరి తమిళ నాట సహా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి కూడా ఇపుడు సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రాబోతుంది. అయితే గత కొన్ని రోజులు కితం ఈ చిత్రం జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుందని బజ్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా అయితే ప్రముఖ ఓటిటి వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మాత్రం ఈ చిత్రం జూలై మొదటి వారంలోనే స్ట్రీమింగ్ కి వచేస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే ఈ డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఈ సినిమా కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఆ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకో విషయం ఈ చిత్రం అన్ని భాషల్లో కూడా హాట్ స్టార్ లోనే రిలీజ్ అవుతుంది. శాటిలైట్ పరంగా అయితే స్టార్ సంస్థల వారు హక్కులు కొనుగోలు చేశారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కమల్ నిర్మించారు. ఈ సినిమాతోనే కమల్ తన అప్పులు అన్నీ తీర్చేసారు.