Kajal Agarwal : అసలు కాంట్రవర్సీ లేకుండా అక్కడ టాప్ 5 లో కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal :ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే మాంచి గ్లామరస్ హీరోయిన్ ల జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు అని అందరికీ తెలుసు. అయితే తన కెరీర్ ఆరంభించి ఒక దశాబ్ద కాలం తన హవా కొనసాగించింది. మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. అరకొర సినిమాలు చేస్తూ పెళ్లి చేసుకొని ఆ లైఫ్ లో బిజీగా వుంది. దీనితో ఈమె కెరీర్ పరంగా కాస్త డౌన్ అయ్యినట్టే కన్ఫర్మ్ అయ్యింది.

అయితే కొన్నాళ్ళు టాలీవుడ్ హీరోయిన్ గా ఉన్న కాజల్ ఇప్పటికీ కూడా సౌత్ ఇండియా టాప్ నంబర్ 1 ప్లేస్ లో నిలిచినట్టు ప్రముఖ ట్విట్టర్ సంస్థ ప్రకటించారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో ఆమె కోసం ట్విట్టర్ లో ఎక్కువగానే ప్రస్తావన వచ్చిందట. ఇది నిజంగా కాజల్ విషయంలో గ్రేట్ అని చెప్పి తీరాలి.

పెద్ద సినిమాల అనౌన్స్మెంట్ లు లేవు. సంచలనం రేపే కాంట్రవర్సీ లు కూడా లేకుండా కాజల్ మాస్ ఫాలోయింగ్ చూపిస్తుంది. దీనితో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కాజల్ చేసిన బిగ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవితో చేసిన “ఆచార్య” మాత్రమే ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 4వ తేదీన రిలీజ్ కానుంది.