టీడీపీ భవిష్యత్ తరాల ఆశాజ్యోతి జూనియర్ ఎన్టీయార్.!

Jr NTR To Take Charge Of TDP, In Near Future

Jr NTR To Take Charge Of TDP, In Near Future

ఇది క్లియర్.. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావుని ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకొచ్చేయాలని టీడీపీ శ్రేణుల్లో కొందరు చాలా బలంగా కోరుకుంటున్నారు. ‘పార్టీ పగ్గాలు చేపట్టడానికి నేను తయారుగా వున్నా..’ అని నందమూరి బాలకృష్ణ చెబుతున్నా, ఆ పగ్గాలు తన తర్వాత తన కుమారుడు నారా లోకేష్ మాత్రమే దక్కించుకునేలా చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నా, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు మాత్రం, తమ అభిమాన నటుడ్ని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ తరాల ఆశాజ్యోతిగా భావిస్తున్నారు. రేపటి ఆంధ్రభోజుడట.. ప్రజా పాలకుడట.. అమరావతి రారాజు అట.. ఇలా యంగ్ టైగర్ ఎన్టీయార్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి కొందరు తెలుగు తమ్మళ్ళ నుంచీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల నుంచీ.

2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన యంగ్ టైగర్, ఆ తర్వాత పెద్దగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిలేడు. ప్రస్తుతం వరుస సినిమాలతోనూ, వీటితోపాటుగా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే గేమ్ షో వ్యవహారాలతోనూ బిజీగా వున్న యంగ్ టైగర్, రాజకీయాల గురించి మాట్లాడే సమయం ఇది కాదంటూ ఈ మధ్యనే స్పష్టత ఇచ్చేశాడు కూడా. కానీ, తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే, జూనియర్ ఎన్టీయార్ ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చి, టీడీపీ పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదిలా వుంటే, యంగ్ టైగర్ ఎన్టీయార్ మంచి కోసం ఆలోచించే కొందరు మాత్రం, వైసీపీకి మద్దతివ్వడం మంచిదనీ, జనసేన వెంట నడవడం మంచిదనీ సూచిస్తుండడం గమనార్హం. కానీ, యంగ్ టైగర్.. టీడీపీని కాదని, వేరే పార్టీ వైపు చూడకపోవచ్చు.