జూ.ఎన్టీయార్ రాజకీయం: బాలయ్యకి అగ్రహం తెప్పిస్తోందా.?

Jr NTR Politics, Is Balayya Not Happy with It

Jr NTR Politics, Is Balayya Not Happy with It

యంగ్ టైగర్ ఎన్టీయార్.. అదేనండీ జూనియర్ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నందమూరి అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొందరు తీవ్రాతి తీవ్రంగా కష్టపడిపోతున్నారు.. తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు.. అక్కడితో ఆగక, టీడీపీ జెండాలకు ధీటుగా తమ అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ జెండాలనీ పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నందమూరి బాలకృష్ణ గుస్సా అవుతున్నారని సమాచారం.

యంగ్ టైగర్ కొత్త సినిమా వస్తే చాలు, నందమూరి అభిమానుల్లోనే కొందరు, ఆ సినిమా ఫ్లాపవ్వాలని కోరుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది.దీనంతటికీ వెనుకాల బలమైన శక్తి ఇంకెవరో కాదు బాలయ్యేననే ఆరోపణలున్నాయి. అబ్బే, బాలయ్య అలాంటివి పట్టించుకోరు.. అని చాలామంది చెబుతున్నా, ఏమో.. బాలయ్య కాకపోయినా, ఆయన సన్నిహితులు ఈ పని చేస్తుండొచ్చంటారు మరికొందరు.

ఇటీవల చిత్తూరు జిల్లాలో వెలసిన జూనియర్ ఎన్టీయార్ జెండాలతో టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై యంగ్ టైగర్ ఎన్టీయార్ సమాధానం ఇచ్చుకునే పరిస్థితి వుండదు.. అతన్ని అడిగేంత సీన్ ఎవరికీ లేదు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ తన అభిమానుల్ని అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణుల నుంచి సోషల్ మీడియాలో కొంత రచ్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ మెగా కాంపౌండుకి దగ్గరవుతున్నాడు.

ఆ మాటకొస్తే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అందరు హీరోలతోనూ సన్నిహితంగానే వుంటాడు. అదే బాలయ్య అభిమానులకి నచ్చడంలేదట. దీన్ని రాజకీయాలకు అన్వయిస్తూ, ఎన్టీయార్ పేరుని బదనాం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి, ఈ రచ్చకి యంగ్ టైగర్ ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో వేచి చూడాలి.