Home News చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్టీయార్

చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్టీయార్

Jr Ntr, Big Threat For Chandrababu

ఎవరు.? యంగ్ టైగర్ ఎన్టీయార్ ఫొటోల్ని చిత్తూరు జిల్లాలోని పలు ఇళ్ళపైన జెండాల్లో పొందుపరిచిందెవరు.? యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ గురించి తీవ్రంగా శ్రమిస్తున్నదెవరు.? టీడీపీలో చీలిక కోసమే ఈ కుట్ర జరుగుతోందా.? టీడీపీ బాగు కోసమే తెలుగు తమ్మళ్ళు ఎన్టీయార్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారా.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు.

వీటికి సమాధానం చెప్పగలిగేదెవరన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కొన్నాళ్ళ క్రితం చంద్రబాబు, తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటించినప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ అభిమానుల నుంచి నినాదాలు ఎదురయ్యాయి. జై యంగ్ టైగర్ ఎన్టీయార్.. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేష్.. అంటూ నినాదాలు వినిపించాయి. ఇప్పుడు మాత్రం జెండాల మీద టీడీపీ రంగు లేదు, టీడీపీ గుర్తు లేదు.. చంద్రబాబు ఫొటోలూ లేవు. లోకేష్ ప్రస్తావన అసలే లేదు. యంగ్ టైగర్ ఎన్టీయార్ అలాగే హరికృష్ణ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి.

రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆ జెండాల ద్వారా యంగ్ టైగర్ అభిమానులు కోరుతున్నారనే విషయం అర్థమవుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీస్తున్నారట. ఎక్కడెక్కడ జెండాలు వున్నాయి.? అవి ఎవరు పెట్టారు.? వాటి ఉద్దేశ్యమేంటి.? అన్న విషయమై ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు వివరాలు సేకరించి, అధిష్టానానికి పంపించే ప్రయత్నంలో బిజీగా వున్నారట. అందులో ఏం తేలబోతోందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

నిజానికి, 2009లో యంగ్ టైగర్ ద్వారా ప్రచారం చేయించుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఎన్టీయార్. ఆ తర్వాత ఆయన్ని దూరం పెట్టేసింది. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీయార్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలున్నాయి. ఏమో, ఏది నిజమోగానీ.. ఎన్టీయార్ వ్యవహారం ఎప్పటికప్పుడు చంద్రబాబుకి తలనొప్పిగా మారుతూనే వుంది.

Related Posts

Related Posts

Latest News