Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్.. అన్యోన్యమైన జంటకు నిదర్శనం ఈ జంట. ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం వల్లనేమో.. ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా జంటగానే చేస్తుంటారు.
వీరిద్దరినీ విడి విడిగా చూసిన సందర్భాలు చాలా తక్కువ అనడం అతిశయోక్తి అనిపించదేమో. అయితే, నిజంగానే ఈ జంట మధ్య అంతటి ప్రేమ, అన్యోన్యతా వున్నాయా.? ఆ విషయమై నెట్టింట బోలెడన్ని ప్రచారాలు హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తుంటాయ్.
రాజశేఖర్‌కి కోపం చాలా ఎక్కువనీ, ఆ కోపంలో భార్య అని కూడా చూడకుండా జీవితపై దారుణంగా చేతి వాటం ప్రదర్శిస్తారనీ అంటుంటారు, ఈ విషయమే జీవిత వద్ద ప్రస్థావించగా, అవును మా ఆయనకి కోపం చాలా ఎక్కువ.
కోపమొస్తే, ఆయన మనిషి కాదు, పిల్లల మీదా అరుస్తారు. నా మీదా విరుచుకుపడిపోతారు.. అలిగి భోజనం కూడా మానేస్తారు.. అంటూ చెప్పాల్సినవన్నీ చెప్పేసి అయినా అదంతా మా పర్సనల్.. అందులో మీరు తలదూర్చడానికి హక్కు లేదు.. అంటూ మీడియాపై రివర్స్ ఎటాక్ చేస్తుంటారావిడ.
ప్రముఖుల ఇళ్లలో జరిగే గొడవలు ఎందుకు పట్టించుకోరు.? మా ఇంట్లో జరిగే గొడవల మీద మీకెందుకంత ఇంట్రెస్ట్.. అంటూ పలు సందర్భాల్లో మీడియా జనాన్ని ఉతికి ఆరేసేస్తుంటారు జీవిత రాజశేఖర్. జీవిత మంచి మాటకారి.
ఆ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆమెతో పెట్టుకుంటే మాములుగా వుండదు.
కాగా, ప్రస్తుతం ఆయన ‘శేఖర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెరిసిన గెడ్డం, జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు ఈ సినిమాలో రాజశేఖర్.