JD Chakravarthy: విడాకులు తీసుకోబోతున్నట్లు మరొక జంట.. ఇందులో నిజమెంత..?

JD Chakravarthy: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రిటీలు విడాకులు తీసుకొని వారి వైవాహిక జీవితానికి ముగింపు పడుతున్నారు. సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత మరొకరు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. గత ఏడాది టాలీవుడ్ క్యూట్ కపుల్ అయినా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ జంట వీరిద్దరూ విడిపోతున్నారు అని ప్రకటించి వారి అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు, పలువురు ప్రముఖులకు షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత నుంచి చైతన్య సమంత ఏదో ఒక విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

మరొక బాలీవుడ్ జంట అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కోలీవుడ్ జంట హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా అంటూ తాజాగా మరొక జంట విడిపోవడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు జె డి చక్రవర్తి,అనుకృతి గోవింద్ శర్మ. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటుడిగా, హీరోగా, విలన్ గా ఎన్నో సినిమాలలో నటించాడు. ఆ తర్వాత 2016లో లక్నో కి చెందిన అనుకృతి గోవింద్ శర్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అతని భార్య కూడా సినీ నేపథ్యం ఉన్న అమ్మాయి.అనుకృతి గోవింద్ శర్మ శ్రీదేవి సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.