Janhvi Kapoor Demands 5 Cr : అవునా.! జాన్వీ కపూర్ ఐదు కోట్లు అడుగుతోందా.?

Janhvi Kapoor Demands 5 Cr

Janhvi Kapoor Demands 5 Cr : అతిలోక సుందరి జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటించే అవకాశముందా.? లేదా.? ఒకవేళ నటిస్తే, అంత ఆషామాషీగా ఆమె టాలీవుడ్‌కి వస్తుందా.? అంటూ రకరకాల అనుమానాలు జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై. అయితే, జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెట్టే సమయం ఆసన్నమైందని తాజాగా అందుతోన్న సమాచారం.

పూరీ జగన్నాధ్ – రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ కాదండోయ్. ‘లైగర్’ తర్వాత కూడా ఈ కాంబో కంటిన్యూ అవుతుందని ఈ మధ్యనే టైటిల్‌తో సహా ఓ సినిమాని అనౌన్స్ చేశాడు పూరీ జగన్నాధ్. అదే ‘జనగణమన’ సినిమా.

అప్పుడెప్పుడో పూరీ, పవన్ కళ్యాణ్ కోసం లాక్ చేసి పెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇన్నాళ్లకు రౌడీ స్టార్‌తో తెరకెక్కించాలని బూజు దులిపి తెర పైకి తీసుకొచ్చాడు. సరే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇంతలోనే జాన్వీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోందంటూ కొత్త పుకార్లు సరికొత్త షికార్లు చేస్తున్నాయ్.

అంతే కాదు, ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అక్షరాలా 5 కోట్లు అని ప్రచారం జోరందుకుంది. అబ్బే.! డెబ్యూ మూవీకే అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ సాధ్యం కాకపోవచ్చు అని టాలీవుడ్ జనం పెదవి విరిచేస్తున్నారు.

అయితే ఇవి జస్ట్ పుకార్లు మాత్రమే. అన్నింటికీ మించి బోనీ కపూర్ ఒప్పుకోవాలి కదా. ఏది ఏమైనా, ఓ ప్యాన్ ఇండియా మూవీతోనే జాన్వీకపూర్ ఎంట్రీ వుండబోతోందని స్పష్టమవుతోంది. అదేంటో చూడాలి మరి.