రాజధాని పేరుతో లక్షల కోట్లు కొట్టేయడమెలా?
ఆయన లక్ష కోట్లు కొట్టేశారన్నారు. ఈయన ఎన్ని లక్షల కోట్లు కొట్టేయాలని ప్లాన్ గీసారు? ఎవరొచ్చినా కొట్టేయడం కామన్ .. అదొక్కటే గ్యారెంటీ.. దోచుకునే దోపిడీ దొంగ నాయకులు ఇంతేనా!! ఇదేనా ఇలాగేనా ప్రజలు ఆలోచించాలి? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
ఒకసారేమో హైటెక్ సిటీ అంటూ కొట్టేశారు. తెలంగాణకు గొప్ప నగరాన్ని ఇచ్చి ఆంధ్రుల్ని మోసం చేశారు. ఇంకోసారేమో అమరావతి అంటూ కొట్టేసేందుకు ప్లాన్ గీశారు. రియల్ వెంచర్లు వేసేందుకు బినామీ స్కెచ్ ని భారీగా వేశారు. ఈ జగన్నాటకంలో వేలు లక్షల కోట్ల ఆట ఎలా ఉండబోతోందో ఇప్పటి అధికారపక్షం చెబుతోంది. మరి అధికార పక్షం మునుముందు ఏం చేయబోతోంది? ఈసారి వైజాగ్ ని కొట్టేస్తారా? రాజధాని మార్పు దేనికి సంకేతం? వికేంద్రీకరణ పేరుతో కొట్టేయడానికి కాదు కదా? నిజంగానే మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయదలిచారా? లేదూ ఎవరేం చేసినా కొట్టేయడం మాత్రం గ్యారెంటీ అంటరా? ప్రజల్ని మభ్య పెట్టడమే పాలకుల నాటకమా? అయితే ఇంకెన్నాళ్లు?
వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుత పాలకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేయబోతున్నారా? చంద్రబాబు నేర్పిన దోపిడీ విధానాన్ని అవలంబించి అదే తప్పు రిపీట్ చేస్తారా? ఆ పచ్చ నాయకుడిని ఫాలో చేస్తారా? టీడీపీ వర్గాలు భయపడుతున్నట్టు.. భయపెట్టేస్తున్నట్టు ఆయన కూడా కోట్లు కొట్టేస్తారా? ఎవరేం కొట్టేసినా ప్రజలు మాత్రం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నారు. ముఖ్యంగా వెనకబడిన ఉత్తరాంధ్ర బాగుపడితే బావుంటుందని ఆశిస్తున్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు ఆయన అనుయాయులు అమరావతిలో భూములు ఎలా కొన్నారు? వారి పెట్టుబడుల్ని లక్షల కోట్లుగా మార్చుకునే వ్యూహం ఎలా రచించారో జగన్ ఇంతకుముందే టీవీ 9 ఇంటర్వ్యూలో చెప్పారు. హెరిటేజ్ పేరుతో చంద్రబాబు అమరావతిలో 14 ఎకరాలు కొన్నారని చెప్పారు. ఆయన బినామీలు ఎన్ని ఎకరాల్ని కొన్నారో.. రైతుల్ని ప్రజల్ని ఎలా మోసం చేశారో కూడా చెప్పారు. అప్పట్లో హైదరాబాద్ కి హైటెక్ సిటీ తెచ్చి దాని చుట్టూ వేల కోట్ల మేర జయభేరి క్లబ్ పేరుతో భారీ వ్యాపారం చేశారు. ఇప్పటికీ హైటెక్ సిటీ గచ్చిబౌళిలో జయభేరి సంస్థ పేరిట వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఇక చంద్రబాబు జగన్నాటకంపై టీవీ 9 కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఇదిగో..