తమిళ హీరో ధనుష్ అంటే డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన సినిమా చేశాడు అంటే అందులో ఏదో ఒక విశేషం ఉండి తీరుతుంది. ఆయన గత చిత్రాలు ‘అసురన్, కర్ణన్’ రెండూ అలాంటి చిత్రాలే. ఇప్పుడు అదే బాటలో ఆయన చేసిన సినిమా ‘జగమే తంతిరం’. కార్తిక్ సుబ్బారాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ నెల16న సినిమా ఓటీటీ ద్వారా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. తమిళ లోకల్ గ్యాంగ్స్టర్ లండన్ వెళితే ఎలా ఉంటుంది అనేదే కథ.
ట్రైలర్ చూశాక సినిమా మీద ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి క్రియేట్ అయింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా ఇది రిలీజ్ కానుంది. మొత్తం 190 దేశాల్లో, 17 భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఇంత భారీ స్థాయిలో ఒక తమిళ చిత్రం రిలీజ్ కావడం ఇదే తొలిసారి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో అథెంటిక్ థీమ్ ఉట్టిపడేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూడబోతే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని అర్థమవుతోంది. గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినా ఇది మాత్రం డిఫరెంట్ అంటున్నారు డైరెక్టర్.