సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ పెట్టడం వెనుక కారణం ఇదే?

టాలీవుడ్ లో రాజమౌళి, త్రివిక్రమ్ లో తో పాటు అంత స్టార్ స్టేటస్ ఉన్న దర్శకుడు సుకుమార్. ‘ఆర్య’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.

లెక్చరర్ గా కెరీర్ మొదలుపెట్టిన సుకుమార్, చిన్నప్పుడు పెద్ద సైంటిస్ట్ కావాలని అనుకునేవాడంట. కొన్నాళ్ళు లెక్చరర్ గా పనిచేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొత్త షర్ట్ కొనుక్కోవాలన్నా ఆలోచించే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు.

మొదటి సినిమా ‘ఆర్య’ సూపర్ హిట్ అయినా కానీ రెండో సినిమా ‘జగడం’ ప్లాప్ అవ్వడం తనను చాలా డిప్రెషన్ కి గురిచేసిందని, అలాగే ఆ టైం లో తన ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు.

సుకుమార్ సినిమాల్ని పరీక్షిస్తే హీరో కి ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగే తన అన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ మాత్రం కచ్చితంగా ఉంటాయి. దీనికి కారణం ‘అ అంటే అమలాపురం’ సినిమాతో ఆర్య సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అయిందని సుకుమార్ తెలిపారు.

ఐటమ్ సాంగ్ పెడితే బిజినెస్ పరంగా ప్లస్ అవుతుండటంతో అలా చేస్తున్నానని  సుకుమార్ అన్నారు.  ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పని లో ఉన్న సుకుమార్ ఆ తర్వాత చిరంజీవి తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది.