సమంత, నాగ చైతన్య విడాకులకు ఆమె కారణమా?

నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని ఇప్పటికి దాదాపు ఏడాది కావస్తుంది, కానీ వాళ్ళ డివోర్స్ టాపిక్ ఇప్పటికి హాట్ టాపిక్ గానే ఉంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మొదట్లో సమంత విపరీతమైన స్కిన్ షో చెయ్యడం, వద్దన్నా ‘ఫామిలీ మాన్’ వెబ్ సిరీస్ లో నటించడం వల్లే గొడవలు వచ్చి విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నాగ చైతన్య కానీ, సమంత కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఇద్దరూ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇక తాజాగా నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ వల్లే చైతు – సమంత, నాగ చైతన్య విడిపోయారని కొన్ని చోట్ల న్యూస్ వచ్చింది.

సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు సమంతకు పడదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని సమంత అడ్డుపడిందట. అదే చైతుతో దూరానికి కారణమైందని.. చివరకు వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యేలా చేసిందని ఒక న్యూస్ వచ్చింది.

సుప్రియ, ‘ఇష్టం’ సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్ ని పెళ్లి చేసుకుంది, కానీ కొన్నాళ్ళకు ఇద్దరు విడిపోయారు, ఆ తర్వాత చరణ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అయితే ‘గూఢచారి’ సినిమా టైం లో సుప్రియ, అడివి శేష్ ప్రేమలో పడ్డారని ఒక న్యూస్ వైరల్ అయ్యింది.