2015నాటి ఓటుకు నోటు కేసు ఇప్పుడు తెర మీదకు రాగా… కేసుతో మత్తయ్యకు సంబంధం లేదని హైకోర్టు చెప్పాక కూడా ఇప్పుడు ఈడీ ఎంటరయ్యి ముత్తయ్యని ఎంక్వయిరీకి పిలిచింది. కేసు మొదట్లో ఈ పేరు తెరపైకి వచ్చినా… తనకు ఈ కేసుతో సంబంధం లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తర్వాత నుండి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. సడన్ గా ఆ కేసు ఇప్పుడే ఎందుకు యాక్టివ్ అయ్యింది, ఈడీ ఇప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చింది, ఈ మొత్తం కేసులో పార్టీలకు అతీతంగా నేతలంతా కలిసి ఒకర్ని టార్గెట్ చేసినట్లు అర్ధమవుతుంది. దీని ద్వారా చాలా మందికి రాజకీయ ప్రతిఫలం లభించే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ మొత్తం టార్గెట్ కేసీఆర్ మీదనే ఉంటదని అందరికి తెలుసు. అలాంటి రేవంత్ కి అధ్యక్ష పదవి ఇస్తే యుద్ధం చేసే వ్యక్తికి కత్తి అందించినట్లే అవుతుంది. కాబట్టి కేసీఆర్ కనుసన్నల్లో నడిచే ఏసీబీ ద్వారా కేసు తెరపైకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ కావాలి కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండే విధంగా జాగ్రత్తపడుతున్నారు. కానీ ఈడీ తెరపైకి రావటమే రాజకీయ క్రీడను భయటపెడుతుంది. సహాజంగా బీజేపీ తల్చుకుంటే కాని ఈడీ తెరపైకి రాదు. ఇక్కడ మాత్రం బీజేపీ రెండు అంశాలను బేరీజు వేసుకున్నట్లు కనపడుతుంది. ఒకటి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ప్రత్యామ్నాయంగా ఎదగలనుకున్న బీజేపీ ఆశ నెరవేరదు. రెండు… కాంగ్రెస్ నేతల్లో కుమ్ములాటలు కొనసాగాలనే కోరుకుంటుంది. అందుకే పీసీసీ రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నేత చక్రం తిప్పటంతో బీజేపీ ఈ పని చేసి పెట్టిందట.
సదరు కాంగ్రెస్ నేత స్వయంగా మత్తయ్యను కలిసి అమ్యామ్యాలు ఇచ్చేసి…రేవంత్ పేరును చెప్పేలా వ్యూహాం రచించారట. అదే సమయంలో ఈడీని ఎంటర్ చేసేందుకు బీజేపీతో గేమ్ నడిపించాడు. ఫలితమే 2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో ఇప్పుడు మత్తయ్యను స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఈడీ పిలవటం. సహజంగా ఈడీ ఎంటర్ అయ్యిందంటే మనీలాండరింగ్ జరగాలి కానీ ఏసీబీ విచారణలో ఎక్కడా అది ప్రూవ్ కాలేదు. రేవంత్ అనే ఒక్కన్ని కొట్టడానికి సొంత పార్టీ కాంగ్రెస్ నుండి ఇంటి దొంగ ఒకరు, ఏకు మేకవుతాడన్న భయంతో కేసీఆర్, రాజకీయ ప్రతిఫలం ఉంటుందనే ఎత్తుగడలో బీజేపీ పార్టీ ఇలా అందరూ కలిసి పన్నాగాలు పన్ని ఇలా ఈడీని రంగంలోకి దించారట.