రామ్ చరణ్, శంకర్ సినిమా రీమేక్ కాదు కదా?

ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ స్టేటస్ అందుకున్న దర్శకుడు శంకర్. కానీ ‘రోబో’ సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఐ’, ‘రోబో 2 .o’ సినిమాలు నష్టాలే మిగిల్చాయి. పైగా శంకర్ అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఐపొద్దని పేరు ఉంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2 ‘, రామ్ చరణ్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు శంకర్.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక విషయం కూడా బయటికి వచ్చింది. రామ్ చరణ్, అంజలి కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో వారిద్దరితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి గెటప్ కూడా పాత కాలానికి తగినట్లు ఉంది.

దీంతో ఈ సినిమా బహుశా శంకర్ దర్శకత్వం వహించిన ‘జెంటిల్మన్’ కి రీమేక్ కావచ్చేమో అంటున్నారు. అయితే దీని పై సినిమా టీం నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.