బిగ్ గాసిప్ : నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర తన స్వశక్తితో స్టార్డం తెచ్చుకున్న కొందరు హీరోల్లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. అయితే ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు మేకోవర్స్ తో వస్తున్న నాని హీరోగా నటించిన సినిమాలు కొన్ని రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

అయితే దాదాపు యంగ్ దర్శకులకే ఛాన్స్ ఇస్తున్న నాని మరో రెండు మూడేళ్ళ తర్వాత ఒక ఊహించని సెన్సేషనల్ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక బిగ్ బజ్ వైరల్ అవుతుంది. ఇది మాత్రం షాకిచ్చే కాంబినేషన్ అని చెప్పాలి.

ఎందుకంటే ఈసారి నాని ఏకంగా కేజీఎఫ్, నెక్స్ట్ ప్రభాస్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసే లాంటి సినిమాలు తీసిన తీస్తున్న హిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నాడట.

ఇప్పుడు ఇదే టాక్ నిన్నటి నుంచి సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ వస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాని కూడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారే నిర్మాణం వహించనున్నారని ఆల్రెడీ నానితో కూడా మాట్లాడారని బజ్ వినిపిస్తుంది.

దీనితో ఒక్కసారిగా ఈ కాంబినేషన్ పట్ల హైప్ భారీ స్థాయిలో పెరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి అనధికారం కావడంతో అభిమానులు మాత్రం ఇది అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు.