ఆచార్య కంటే గాడ్ ఫాదర్ ఘోరమా?

చిరంజీవి కెరీర్ లో ‘ఆచార్య’ అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ప్లాప్ తో ఎంతో నిరాశ చెందిన చిరంజీవి సందర్భం ఉన్నా, లేకున్నా ఆ సినిమా ప్లాప్ కి కారణం కొరటాల శివ అని చాలా సందర్భాల్లో అన్నాడు. అప్పటివరకు ఒక్క ప్లాప్ లేని కొరటాల శివను చిరంజీవి బ్లేమ్ చెయ్యడం చాలా మందికి నచ్చలేదు.

అయితే తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ముందుకు వచ్చాడు. హిందీ లో కూడా మార్కెట్ విస్తరించడం కోసం గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ ని దింపాడు. సల్మాన్ ఖాన్ రోల్ అంతగా వర్క్ అవుట్ అవ్వకపోయినా…గాడ్ ఫాదర్ సినిమాకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

హిట్ టాక్ తో సినిమా ముందుకు దూసుకుపోతున్న కానీ కలెక్షన్స్ మాత్రం లేవు. అసలు టాక్ కి కలెక్షన్స్ కి మాత్రం సంబంధం లేదు. చిరంజీవి కెరీర్ బెస్ట్ కొడతాడు అంటుకుంటే లోయస్ట్ నమోదు చేశాడు. చిరంజీవి కెరీర్ డిజాస్టర్ ఆచార్య ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సగం కూడా రాలేదు.

ఎప్పుడో 2017 లో విడుదలైన ఖైదీ 150 రూ. 23.5 ఓపెనింగ్ డే షేర్ రాబట్టగా గాడ్ ఫాదర్ మొదటిరోజు కేవలం రూ. 13 కోట్ల షేర్ రాబట్టింది. ముందు ముందు కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.