ఓటీటీలో “ఆచార్య” హిట్టయ్యిందా? ఆ దేశంలో మాములుగా ఆదరగొట్టట్లేదు..!

Acharya

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా “ఆచార్య”. అనౌన్స్మెంట్ నుంచే అదిరే హైప్ ని ఈ సినిమా తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా సినిమా రిలీజ్ టైం వచ్చేసరికి మాత్రం ఆంతా మారిపోయింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమాలో ఉన్నాడు. అయినా కూడా ఈ సినిమా ఏమాత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేక భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి సుమారు 120 కోట్లకి మేర బిజినెస్ కాగా అందులో సగం కూడా రాబట్టలేక చిరు మరియు టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక భారీ ప్లాప్ గా నిలిచింది.

మరి ఆ దెబ్బకు కొంత నష్టం పూడ్చాలని స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ముందే డీల్ చేసుకొని కాస్త త్వరగా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అయితే ఓటీటీ లోకి వచ్చాక మన దగ్గర ఏమో కాని అప్పుడు థియేటర్స్ లో చూడని వాళ్ళు అంతా ఇప్పుడు చూసారు. అందుకే ఒకింత రెస్పాన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఓ దేశంలో అయితే ఆచార్య సినిమా ప్రైమ్ లో వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు నెంబర్ 1 ప్లేస్ లోనే ట్రెండ్ అవుతూ రావడం ఆశ్చర్యకరంగా మారింది.

Acharya
Acharya

అది కూడా సింగపూర్ లో అట. అక్కడ మన దేశపు సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది కానీ ఇంత డిజాస్టర్ సినిమా ఇన్ని రోజులు ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం గమనార్హం అంటే ఈ లెక్కన ఓటీటీ లో ఈ సినిమా హిట్టే అని చెప్పి తీరాలి. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అయితే పూజా హెగ్డే నటించగా మెగాస్టార్ సరసన కాజల్ ని పెట్టారు కానీ లాస్ట్ లో తీసేసారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి లు నిర్మాణం వహించారు.