సర్కారు వారి పాట’ ఫస్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

Interesting Update On Sarkaru Vaari Paata First Song | Telugu Rajyam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ వచ్చి భారీ రెస్పాన్స్ ని కూడా అందుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ చిత్రం నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది.

థమన్ ఇచ్చిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో అలా రిలీజ్ కానుందట. దీనిపై అనౌన్సమెంట్ కూడా ఈ వారంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని కోసం అయితే మహేష్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబో హిట్ ఆల్బమ్స్ మూడు ఉన్నాయి అందుకే ఇది మరింత స్పెషల్ గా మారింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles