స్టార్ హీరో వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకోవడం వెనుక ఇంత జరిగిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలామంది రిస్కీ రోల్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నా అభిమానులు యాక్సెప్ట్ చేయరేమో అనే భయం వల్ల రిస్కీ రోల్స్ చేయడానికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే కొందరు హీరోలు మాత్రం కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలలో అయినా నటించడానికి అంగీకరిస్తారు. టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ప్రశంసలు పొందిన హీరోలలో వెంకటేష్ ఒకరు.

వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో చాలా సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయ్యేవారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కి హిట్టైన సినిమాలలో పవిత్ర బంధం సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తైంది.

పవిత్ర బంధం సినిమాకు ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. 1996 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో విక్టరీ వెంకటేష్ సౌందర్య కాళ్లు పట్టుకుంటారు. మహిళా ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సౌందర్య తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి.

వెంకీ సౌందర్య కాళ్లు పట్టుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుందని చాలామంది అప్పట్లో కామెంట్లు చేశారు. అయితే నెగిటివ్ కామెంట్లను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కన్నడ భాషలో రీమేక్ కాగా కన్నడలో ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.