విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న వెంకటేష్ నిదానంగానే సినిమాలు చేస్తూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు వెంకటేష్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. చంటి, కలిసుందాంరా సినిమాలు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి అతని మార్కెట్ ను పెంచాయి.
అయితే విక్టరీ వెంకటేష్ కెరీర్ లో హిట్లుగా నిలిచినా కొన్ని సినిమాలు మాత్రం ఇండస్ట్రీ హిట్లుగా నిలవలేదు. వెంకటేష్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బ్రహ్మపుత్రుడు సినిమా కూడా ఒకటి. 100 రోజుల సెంటర్ల విషయంలో చిరంజీవి నటించిన పలు సినిమాలు ముందువరసలో ఉండటంతో వెంకీ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలయ్యారు. వెంకటేష్ కెరీర్ లో అభిమానులు మెచ్చిన సినిమాలలో బొబ్బిలి రాజా ఒకటనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వల్ల ఈ సినిమా ఖాతాలో రికార్డ్ చేరలేదు. వెంకటేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన ప్రేమించుకుందాంరా విజయశాంతి సినిమా వల్ల ఇండస్ట్రీ హిట్ కాలేదు. సూర్యవంశం సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. వెంకీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో రాజా ఒకటి.
ఈ సినిమాకు 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చినా సమరసింహారెడ్డి రికార్డులను బ్రేక్ చేయలేకపోవడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు. వెంకటేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి కాగా బాలయ్య నటించిన నరసింహ నాయుడు సినిమా వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు. ఈ విధంగా వెంకటేష్ భారీ ఇండస్ట్రీ హిట్లను మిస్ చేసుకున్నారని చెప్పాలి.