కృష్ణ కోసం రాసిన కథలో చరణ్.. మగధీర గురించి షాకింగ్ విషయాలు రివీల్!

రాజమౌళి సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నా మగధీర సినిమా విజయం ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు స్టార్ హీరోగా గుర్తింపు దక్కడానికి ఒక విధంగా కారణమైన సినిమా మగధీర అని చెప్పవచ్చు. మగధీర సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి. కృష్ణ హీరోగా సాగర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో జగదేకవీరుడు సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాల్సి ఉండగా ఈ సినిమా కోసం జక్కన్న కూడా పని చేశారు. అయితే విజయేంద్ర ప్రసాద్ కృష్ణ కోసం రాసిన కథ మేకర్స్ కు నచ్చలేదు. ఆ తర్వాత చిరంజీవి రాజమౌళితో చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలని కోరారు. రాజమౌళి చరణ్ కు ఏం వచ్చో తెలుసుకుని దానికి తగిన విధంగా కథ సిద్ధం చేయాలని అనుకున్నారు. కృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ రాసిన కథకు స్వల్పంగా మార్పులు చేసి మగధీర సినిమాను తెరకెక్కించారు.

చరణ్ కు గుర్రపుస్వారీ రావడంతో మగధీర కథ చరణ్ కు సూట్ అవుతుందని జక్కన్న భావించారు. మొదట మగధీర సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరును పరిశీలించిన మేకర్స్ ఆ తర్వాత కాజల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో కళ్లు చెదిరే సీన్లు ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పీటర్ హెయిన్స్ కు ప్రమాదం జరిగింది. ఈ సినిమా కోసం చరణ్ ఎంతగానో కష్టపడ్డారు.

దాదాపుగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించింది. మెగా అభిమానులకు ఎంతగానో నచ్చిన సినిమాలలో మగధీర సినిమా ఒకటి కావడం గమనార్హం. రామ్ చరణ్ కు ఈ సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. మగధీర తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ మరో సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సినిమాసినిమాకు చరణ్ రేంజ్, మార్కెట్ పెరుగుతోంది.