మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే సంగతి తెలిసిందే. బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు తక్కువ సమయంలోనే నటుడిగా ఊహించని స్థాయిలో పాపులర్ కావడంతో పాటు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచింది.

మోహన్ బాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టిన మోహన్ బాబు కెరీర్ తొలినాళ్లలో 250 రూపాయల జీతానికి పని చేశారు. మోహన్ బాబు సినిమాల్లో పని చేస్తుండటంతో మొదట కొన్ని సంబంధాలు పోయాయి. సినిమాల్లో ఉంటే పెళ్లి జరగదని కొంతమంది మోహన్ బాబు తండ్రికి సూచించారు. అయితే విద్యావతి అనే యువతితో తర్వాత రోజుల్లో మోహన్ బాబుకు వివాహం జరిగింది.

మోహన్ బాబు విద్యావతి దంపతుల కూతురు పేరు లక్ష్మీ ప్రసన్న కాగా కొడుకు విష్ణు కావడం గమనార్హం. అయితే ఊహించని విధంగా విద్యావతి చనిపోయారు. ఆ తర్వాత మోహన్ బాబు విద్యావతి చెల్లి నిర్మలను పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు నిర్మల దంపతులకు ఒక కొడుకు కాగా కొడుకు మంచు మనోజ్ అనే సంగతి తెలిసిందే. మనోజ్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. మనోజ్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా అనే సినిమాలో నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మంచు విష్ణు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మోహన్ బాబు స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. మోహన్ బాబు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.