ఆ నిర్మాత ఫోన్ కాల్ వల్ల భయపడిన చిరంజీవి భార్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తన నటనతో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న చిరంజీవితో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని భావించే దర్శకనిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉంది. చిరంజీవితో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకునే నటీనటులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎంతోమంది దర్శకులకు స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు రావడానికి చిరంజీవి కారణమయ్యారు.

చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. “రాననుకున్నారా.. రాలేనన్నుకున్నారా”, “మొక్కే కదా అని పీకేస్తా పీక కోస్తా” డైలాగ్ లు ఇంద్ర సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందు చిరంజీవి నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం.

ఇంద్ర సినిమాకు చిన్నికృష్ణ కథ అందించారు. ఈ సినిమాలో తప్పు నా వైపు ఉంది డైలాగ్ ను చిరంజీవి సొంతంగా రాశారని తెలుస్తోంది. రిలీజ్ కు ముందు సినిమాను చూసిన అశ్వనీదత్ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా చిరంజీవి భార్య సురేఖ ఫోన్ ను లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అశ్వనీదత్ చిరంజీవితో సినిమా అద్భుతంగా ఉందని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పారని సమాచారం.

అశ్వనీదత్ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చిరంజీవి లుక్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 2002లో ఈ సినిమా ఏకంగా 27 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.