మహేష్ బాబు సినీ కెరీర్ లో ఆగిపోయిన తొమ్మిది సినిమాలు ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలపై దృష్టి పెట్టారు. రాజమౌళి సినిమా రిలీజయ్యే వరకు మహేష్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి మహేష్ రెండు నుంచి మూడేళ్ల పాటు రాజమౌళి సినిమాకు పరిమితం కానున్నారు.

అయితే మహేష్ కెరీర్ లో ఆగిపోయిన తొమ్మిది సినిమాలు ఉన్నాయి. సినిమాలకు సంబంధించి ప్రకటన వచ్చి ఈ సినిమాలు ఆగిపోవడం గమనార్హం. ఈ సినిమాలు అగిపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా సైన్యం అనే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి ఆగిపోయింది. మహేష్ హీరోగా మిర్చి టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది.

మహేష్ హీరోగా వరుడు టైటిల్ తో మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా ఆగిపోయింది. మహేష్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా కూడా ఆగిపోయింది. మహేష్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ తో తెరకెక్కాల్సిన సినిమా కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం గమనార్హం. మహేష్ మణిరత్నం కాంబోలో వీరుడు టైటిల్ తో తెరకెక్కాల్సిన సినిమా కూడా ఆగిపోయింది.

మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హరేరామ హరేకృష్ణ టైటిల్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. మహేష్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన జనగణమన కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా కూడా ఆగిపోయింది. కథ నచ్చకపోవడం వల్లే మహేష్ బాబు ఈ సినిమాను ఆపేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.