సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు, యాడ్స్ ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదిస్తూ ఆ డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొన్ని నెలల క్రితం కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు. రమేష్ బాబు హీరోగా పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.
ఇందిరా, కృష్ణా దంపతులకు 1965 సంవత్సరంలో రమేష్ బాబు జన్మించారు. అల్లూరి సీతారామరాజు సినిమ కొరకు రమేష్ బాబు బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించినా రమేష్ బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సామ్రాట్ సినిమాతో రమేష్ బాబు హీరోగా ఆరంగేట్రం చేశారు. నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో రమేష్ బాబు సినిమా రంగానికి దూరమయ్యారు.
హిందీలో ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన సూర్యవంశం అనే సినిమాకు రమేష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అర్జున్ సినిమాను రమేష్ బాబు సోలోగా నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు రాలేదు. అతిథి సినిమాను రమేష్ బాబు యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మించారు.
అయితే అతిథి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అయితే తన సినిమాల ద్వారా అన్నకు నష్టం వచ్చిన సమయంలో మహేష్ బాబు ఆర్థికంగా సహకారం అందించిన సందర్భాలు ఉన్నాయి. అన్న కోసం మహేష్ బాబు ఆర్థికంగా ఎన్నో త్యాగాలు చేశారు. రమేష్ బాబు దూకుడు సినిమాకు మాత్రం ప్రజంటర్ గా వ్యవహరించడం గమనార్హం.