స్టార్ హీరో మహేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో పోకిరి సినిమా ఒకటి అనే సంగతి తెలిసిందే. తెలుగులో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. మొదట రవితేజకు పూరీ జగన్నాథ్ పోకిరి సినిమా కథను వినిపించారు. కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో పోకిరి రాలేదు.
ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం విషయంలో సైతం మార్పులు చోటు చేసుకున్నాయి. మహేష్ ఈ కథ విన్న తర్వాత కొన్ని మార్పులు సూచించగా ఆ తర్వాత ఈ సినిమా కథ పోకిరిగా మారింది. మొదట అయేషా టకియా, కంగనా ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపికై కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఈ సినిమాతోనే ప్రేక్షకులకు మహేష్ బాబులోని మాస్ యాంగిల్ పరిచయమైంది. కొన్ని నెలల పాటు జుట్టు కట్ చేసుకోకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు. ఈ సినిమా కోసం మహేష్ తన డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా మార్చుకున్నారు. మణిశర్మ పాటలు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. బుల్లితెరపై కూడా ఈ సినిమా మంచి రేటింగ్స్ ను అందుకుంది.
అయితే ఈ సినిమా కథను స్టేట్ రౌడీ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారని చాలామంది భావిస్తారు. స్టేట్ రౌడీ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ కాప్ గా నటించగా ఈ సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా కనిపించారు. అటు స్టేట్ రౌడీ ఇటు పోకిరి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల విజయాలు చిరంజీవి, మహేష్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.