మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నప్పటికీ అతడు సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో మురళీ మోహన్ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా ఫుల్ రన్ లో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవడం గమనార్హం. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అని చెప్పవచ్చు.
ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు చెప్పగా పవన్ ఆ కథను రిజెక్ట్ చేశారనే సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఈ సినిమా కథను ఉదయ్ కిరణ్ కు కూడా చెప్పారని కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారని సమాచారం. రైటర్ గా సక్సెస్ అయిన సమయంలో త్రివిక్రమ్ డైరెక్టర్ గా కూడా సత్తా చాటాలనే ఆలోచనతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్రివిక్రమ్ ఉదయ్ కిరణ్ ను కలిసిన సమయంలో ఉదయ్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
త్రివిక్రమ్ చెప్పిన అతడు కథ అద్బుతంగా ఉండటంతో ఈ సినిమాలో నటించడానికి ఉదయ్ కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మురళీ మోహన్ ఈ సినిమాకు నిర్మాత కాగా మురళీ మోహన్ నుంచి ఉదయ్ కిరణ్ కు అడ్వాన్స్ కూడా అందిందని బోగట్టా. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఉదయ్ కిరణ్ డేట్ల సమస్య వల్ల ఈ సినిమాను వదులుకున్నారు. పవన్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదు.
మహేష్ బాబు కథ నచ్చడంతో ఈ సినిమాను తమ బ్యానర్ లోనే నిర్మించాలని భావించారు. అయితే మురళీ మోహన్ అప్పటికే అడ్వాన్స్ ఇవ్వడంతో త్రివిక్రమ్ ఆయన బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుండగా ఈ ఏడాదే ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.