రాజశేఖర్ డ్యాన్స్ గురించి వాళ్లు అలాంటి కామెంట్లు చేశారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మేన్ గా కొన్నేళ్ల పాటు వరుస విజయాలతో రాజశేఖర్ ఒక వెలుగు వెలిగారు. రాజశేఖర్ ఎక్కువగా పోలీస్ రోల్స్ లో నటించగా ఆ పాత్రలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. పోలీస్ రోల్స్ లో నటించడం ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు రాజశేఖర్ ఖాతాలో చేరాయి. తాజాగా రాజశేఖర్ హీరోగా నటించి థియేటర్లలో విడుదలైన శేఖర్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం ఎక్కువగా రాలేదు.

కోర్టు కేసులో చిక్కుకోవడంతో పాటు తాజాగా విడుదలైన ఎఫ్3 సినిమాకు హిట్ టాక్ రావడంతో రాజశేఖర్ సినిమాకు మైనస్ అయింది. ఈ వారం మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజవుతూ ఉండటంతో రాజశేఖర్ సినిమా దాదాపుగా మెజారిటీ థియేటర్లను కోల్పోయే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కెరీర్ తొలినాళ్లలో సీరియస్ రోల్స్ లో ఎక్కువగా నటించిన రాజశేఖర్ ఆ పాత్రల ద్వారా మాస్ ఫ్యాన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

అయితే క్లాస్ సినిమాలను తెరకెక్కించే రాఘవేంద్రరావు రాజశేఖర్ తో అల్లరి ప్రియుడు సినిమా తీయడానికి సిద్ధం కాగా చాలామంది ఆయనకు వద్దని సూచనలు చేశారు. అల్లరి ప్రియుడు సినిమాలోని పాటలకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ కాగా ప్రభుదేవా చూపించిన సింపుల్ స్టెప్స్ ను చేయడానికి కూడా రాజశేఖర్ ఇబ్బంది పడేవారని సమాచారం. అయితే రాజశేఖర్ పై ప్రభుదేవా మాత్రం ఎప్పుడు సీరియస్ అయ్యేవారు కాదు.

ప్రభుదేవా చివరకు సైడ్ డ్యాన్సర్లు కానీ సహాయకులు కానీ ఆయన వేసిన స్టెప్పులనే ఫాలో కావాలని సూచనలు చేశారు. ఆ సమయంలో చాలామంది ఆయనను సరదాగా డాక్టర్ మైకేల్ జాక్సన్ అని పిలిచేవారు. ఒక సందర్భంలో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. డ్యాన్స్ విషయంలో రాజశేఖర్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఇతర విషయాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సరైన హిట్ పడితే రాజశేఖర్ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.