ఆలస్యంగా రిలీజ్ కావడం వల్ల డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు. అయితే చిరంజీవి సినీ కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. చిరంజీవి, అమల కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా రాజా విక్రమార్క అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాధిక మరో హీరోయిన్ గా నటించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

అయితే రాజా విక్రమార్క మూవీ షూటింగ్ సమయంలోనే చిరంజీవి హిందీలో ప్రతిబంధ్ అనే సినిమాలో నటించాల్సి వచ్చింది. రెండు సినిమాల రిలీజ్ డేట్లు క్లాష్ కావడంతో చిరంజీవి రాజా విక్రమార్క నిర్మాత అమరనాథ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో నిర్మాత నా సినిమా ఆలస్యం అవుతుందనే ఆలోచనను మీ మనస్సులోకి రానివ్వవద్దని మీరు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లడం అందరికీ గర్వ కారణం అని అమరనాథ రెడ్డి తెలిపారు.

రాజా విక్రమార్క సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకుడు కాగా ప్రతిబంధ్ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించడం గమనార్హం. ప్రతిబంధ్ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి అమల అమెరికాలో రాధిక లండన్ లో ఉన్నారు. అందరి డేట్లు సెట్ చేసి రాజా విక్రమార్క షూటింగ్ ను పూర్తి చేయడానికి ఈ సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. షూటింగ్ మొదలైన 15 నెలల తర్వాత ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

షూటింగ్ ఆలస్యం కావడం ఇతర కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. రవిరాజా పినిశెట్టి సరికొత్త బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని చిరంజీవి భావించినా ఆయన అంచనాలకు భిన్నంగా ఈ సినిమా ఫలితాన్ని అందుకోవడం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.