అమితాబ్ బచ్చన్ కు చెమటలు పట్టించిన మెగాస్టార్ చిరంజీవి మూవీ తెలుసా?

అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకుంటే చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే చిరంజీవి తను హీరోగా తెరకెక్కిన సినిమాతో అమితాబ్ బచ్చన్ కు చెమటలు పట్టించిన సందర్భాలు సైతం ఉన్నాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఘరానా మొగుడు కూడా ఒకటి.

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి, నగ్మా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని బంగారు కోడిపెట్టె సాంగ్ కూడా సూపర్ హిట్ అనే సంగతి తెలిసిందే. కన్నడలో సక్సెస్ సాధించిన సినిమాకు ఘరానా మొగుడు పునర్నిర్మాణం కావడం గమనార్హం.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో దేశంలోనే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా చిరంజీవి వార్తల్లో నిలిచారు. ఈ సినిమా సక్సెస్ తో కోటీ 25 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చిరంజీవి ఎదిగారు. మెగాస్టార్ నటన వల్లే ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుందని అభిమానులు భావిస్తారు.

మలయాళంలో హే హీరో టైటిల్ తో ఈ సినిమా విడుదల కాగా మలయాళంలో కూడా ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. కేరళలో ఫస్ట్ రన్ లో ఈ సినిమా ఏకంగా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. కీరవాణి పాటలు సైతం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ విధంగా అప్పట్లోనే ఇతర భాషల్లో కూడా చిరంజీవి తన నటనతో సత్తా చాటారు.