కేజీఎఫ్‌లో గరుడ‌గా న‌టించిన వ్య‌క్తి ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు భార‌తీ సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్‌. య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించింది. రాఖీ భాయ్‌గా న‌టించిన యష్‌కు ఈ చిత్రంతో ఎంత పేరు వ‌చ్చిందో గ‌రుడ అనే పాత్ర‌కు కూడా ఆద‌ర‌ణ ల‌భించింది. రాఖీ పాత్ర‌కు ధీటుగా న‌టించిన గ‌రుడ అనే పాత్ర‌లో న‌టించింది అనే ఎవరే విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. కాని అతనెవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం.

కేజీఎఫ్ చిత్రంలో హీరోకు ధీటుగా భారీ కండ‌ల‌తో గ‌రుడ‌గా ప‌వ‌ర్‌ఫుల్ రోల్ పోషించిన వ్య‌క్తి పేరు రామ్. వాస్త‌వానికి అత‌ను న‌టుడు కాదు, య‌ష్ బాడీ గార్డ్‌. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంద‌ట‌. ఎప్ప‌టి నుండో ఇద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో న‌టించాల‌ని అనుకుంటుండ‌గా, ఆ క‌ల కేజీఎఫ్‌తో తీరింది. య‌ష్‌తో క‌థ చ‌ర్చించే స‌మ‌యంలో రామ్‌ని చూసిన ప్రశాంత్ నీల్‌.. గ‌రుడ పాత్ర‌కు ఇత‌ను స‌రిపోతాడ‌ని భావించాడు. అత‌డిని ఆడిష‌న్ కూడా చేశాడ‌ట‌. స‌రిగ్గా స‌రిపోతాడని భావించి అతడిని ఫైన‌ల్ చేశాడ‌ని తెలుస్తుంది.

కేజీఎఫ్ చిత్రంలో నేను న‌టించానంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తాన‌ని క‌లలో కూడా ఊహించ‌లేదు. సినిమా చూసాక అది ఎంత ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అనేది అర్ధ‌మైంద‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం అత‌నికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. కార్తీ సుల్తాన్‌తో పాటు ఓ తెలుగు సినిమాలో కూడా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సంజయ్‌ దత్‌, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టాండన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సిన‌మా టీజ‌ర్‌ను జనవరి 8న విడుద‌ల చేయ‌నున్నారు.