వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపు 18నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వీలైన్నంత వరకు నెరవేరుస్తూ వస్తుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు కోర్టులకు వెళ్తున్నాయి. అలాగే తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఇలా వైసీపీ పాలన నడుస్తున్న సమయంలో కనీసం పార్టీలోని సీనియర్ నేతలకు కూడా చెప్పకుండా జగన్ చేసిన పని ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుండగా, టీడీపీ నేతలను ఆందోళనలో పడేస్తుంది.
శుభవార్త చెప్పిన ఇంటెలిజెన్స్ వర్గాలు
సీఎం జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తుంది కాబట్టి తన పాలన గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వర్గాల సహాయంతో సర్వే చేయిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వే చేయించేవారు. అయితే ఇప్పుడు జగన్ కు ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో వైసీపీ నేతలు సంతోషంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూచాయగా మీడియాకు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. దీనిని బట్టి మహిళల్లో జగన్‌పై అబిమానం పెరిగిందట. జగన్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై మహిళల్లో సానుభూతి పెరిగిందని మహిళా ఓటు బ్యాంకు తమకేనని ఆయన చెప్పుకొచ్చారు.
కష్టాల్లో టీడీపీ
ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ తో వైసీపీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు, కానీ టీడీపీ శ్రేణులు మాత్రం విషాదంలో ఉన్నారు. ఇప్పటికే పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీకి ఈ రిపోర్ట్ మరింత తలనొప్పి తెచ్చింది. ఇప్పటికే శ్రేణుల్లో ఉత్సహం నింపడానికి చంద్రబాబు నాయుడు అనేక తంటాలు పడుతున్న సమయంలో ఇలా వైసీపీకి మద్దతుగా రిపోర్ట్స్ వస్తుండటంతో శ్రేణులు ఎలా ఉత్తేజపరచాలో తెలియక చంద్రబాబు తల పట్టుకున్నారు.