Mega Hero : ఇన్సెడ్ టాక్ : ఓటిటిలో రిలీజ్ కాబోతున్న మెగా హీరో బిగ్ మూవీ.!

Mega Hero : రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నా ఇంకా కాస్త సందిగ్ధత నెలకొంది. తెలుగు ఆడియెన్స్ అన్ని సినిమాలు కూడా చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఇంకా రిలీజ్ కి రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు ఇదే లైన్ లోకి యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “గని” కూడా చేరిపోయింది.

మొదట రెండు మూడు సార్లు సినిమా రిలీజ్ డేట్ ని వీరు అనౌన్స్ చేసినా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యిపోయారు. దీనితో ఈ బిగ్ ప్రాజెక్ట్ పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఊహించని ట్విస్ట్ తో ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి చిత్ర బృందం ఆసక్తి చూపట్లేదు అట. ఓటిటి లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం అయితే ఈ డీల్ కి సంబంధించిన చర్చలే నడుస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్సెడ్ టాక్. అయితే ఈ సినిమాతో పాటు నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమాకి కూడా ఇలానే టాక్ రాగ వారు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇంకా వీరి నుంచి అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.

దీనితో ఈ సినిమా ఓటిటి రిలీజ్ బహుశా కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అయితే చాలా కష్టపడ్డాడు. మరి లాస్ట్ మినిట్ లో ఏం జరుగుతుందో చూడాలి.