ఇన్సైడ్ టాక్ : ఓటీటీలో “సర్కారు వారి పాట” కి డేట్స్ వచ్చేసాయా? ఎప్పుడంటే..

ఈ ఏడాదికి టాలీవుడ్ దగ్గర బిగ్ హిట్ అయ్యిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి డివైడ్ మిక్సిడ్ టాక్ లతోనే భారీ హిట్ దిశగా వెళ్తుంది. ఆల్ మోస్ట్ వసూళ్లు రాబట్టేసిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లలో మంచి రన్ కొనసాగిస్తోంది.

అయితే ఈ సినిమాపై ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో ఇన్సైడ్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరి ఈ యాప్ లో ఈ సినిమా ఈ రానున్న జూన్ 10న స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే ఒకవేళ గాని ఇది మిస్ అయితే జూన్ మూడో వారం చివరలో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. మొత్తానికి అయితే వచ్చే నెల లోనే సర్కారు వారి ఓటీటీ పాట ఉంటుంది అట. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా పరశురాం పెట్ల దర్శకత్వం వహించాడు. అలాగే నదియా, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కి థమన్ సంగీతం అందిచాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబు అలాగే 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మించారు.