ఇన్సైడ్ టాక్ : ఈ సినిమా స్క్రిప్ట్ లో వేలు పెడుతున్న పవన్..?

Bhavadeeyudu Bhagat Singh

ప్రెజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు ఆల్రెడీ ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. ఈ సినిమా సెట్స్ మీద ఉంది అలాగే రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన మరో భారీ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసింది కూడా తెలిసిందే.

“భవదీయుడు భగత్ సింగ్” అంటూ అనౌన్స్ చేసిన ఈ సినిమా క్రేజీ అంచనాలు సెట్ చేసుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది దేవుడెరుగు అయితే తాజాగా సినీ వర్గాల నుంచి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

గత కొన్ని వారాల కితం ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కలిసి పవన్ దగ్గరకి వెళ్తారని తెలిసింది. అయితే ఇది సినిమా ఎప్పుడు స్టార్ట్ అని పవన్ ని అడగడానికి అని చాలా మంది అందుకున్నారు. కానీ దీనికి అసలు కారణమ్ ఏంటి అని ఇప్పుడు తెలిసింది.

నిజానికి కి ఫైనల్ నరేషన్ ఇవ్వడానికి వారు వెళ్లారట. మరి దీనితో అయితే పవన్ ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెయ్యాలని చెప్పినట్టుగా బోగట్టా దీనితో ఈ సినిమా స్క్రిప్ట్ లో కూడా పవన్ వేలు పెట్టినట్టుగా అంటున్నారు. మరి ఇదేం అవుతుందో చూడాలి.