Pushpa Part 2 : టాలీవుడ్ నుంచి స్టైలిష్ స్టార్ గా మొదలయ్యి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ గా జెండా పాతిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎలాంటి రాజమౌళి లేకుండా హిందీలో 100 కోట్లు కలిగిన ఏకైక తెలుగు సినిమా హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు.
పుష్ప అనే సినిమాతో కలకలం రేపిన ఈ ఐకాన్ స్టార్ నెక్స్ట్ చెయ్యబోయే పుష్ప పార్ట్ 2(పుష్ప ది రూల్) తో మరోసారి పాన్ ఇండియా సినిమాని ఏలడానికి వస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్న పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా అసలు ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది అని సినీ వర్గాల్లో లేటెస్ట్ ఇన్సైడ్ టాక్.
దర్శకుడు సుకుమార్ ఇంకా ఈ సినిమా షూటింగ్ పట్ల సిద్ధంగా లేరని తెలుస్తుంది.
అసలుకి అయితే ఈ మార్చ్ నుంచి కానీ ఏప్రిల్ నుంచి కానీ షూటింగ్ ని స్టార్ట్ చేసి దసరా నాటికి రిలీజ్ చెయ్యాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికే ఇంకా నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుందట. అంటే ఇక ఆ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో అర్ధం చేసుకోవాలి.
ప్రస్తుతానికి అయితే బన్నీ ఫ్యాన్స్ కి మరింత స్థాయి ఎదురు చూపులు తప్పవని చెప్పాలి. మరి సుకుమార్ ఏమన్నా ప్లాన్ లో మార్పు చేస్తాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.