ఇన్సైడ్ టాక్ : అయితే బాలయ్య లేకపోతే చిరు..ఎవరో ఒకరే.!

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నటువంటి సీనియర్ హీరోస్ లో నందమూరి వారి నటసింహ బాలకృష్ణ కొద్ది కొద్దిగా తన మార్కెట్ ని అయితే పెంచుకుంటూ వెళ్తుండగా మరో స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన మార్కెట్ ని పోగొట్టుకుంటున్నారు. రీమేక్ తో సేఫ్ గేమ్ ఆడినా కూడా కొన్ని రోజులు వరకు పర్వాలేదు కానీ గట్టి ఓపెనింగ్స్ అయితే ఈ చిత్రాలకి ఇప్పుడు రావట్లేదు.

మరి దాదాపు ఐదేళ్ల కితం ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో “ఖైదీ 150”, “గౌతమి పుత్ర శాతకర్ణి” చిత్రాలతో పోటీ పడ్డారు. మరి మళ్ళీ ఇపుడు 2023లో అయితే మెగాస్టార్ మరియు బాలయ్య లు తమ 154, 197 చిత్రాలతో తలపడనున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ఏమిటంటే ఈ సంక్రాంతిలో ఉంటే బాలయ్య లేకపోతె చిరు సినిమా మాత్రమే ఉంటుంది అని తెలుస్తుంది. ఏదో ఒక సినిమా డెఫినెట్ గా వాయిదా పడడం ఖాయం అని అంటున్నారు. దీనితో అయితే వీరి మధ్య వస్తుంది అనుకున్న యుద్ధం ఉండకపోవచ్చనే అంటున్నారు.

అయితే దీనిపై మాత్రం మరింత సమాచారం కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో శృతి హాసన్ నే హీరోయిన్ గా నటిస్తుండగా మెగాస్టార్ సినిమాకి బాబీ, బాలయ్య సినిమాకి గోపీచంద్ మలినేని లు దర్శకత్వం వహిస్తున్నారు.