సెన్సిబుల్ చిత్రాలను హృద్యంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. చివరిగా వరుణ్ తేజ్, సాయి పల్లవితో కలిసి ఫిదా అనే చిత్రం చేయగా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి పసందైన వినోదాన్ని అందించింది. ఇందులో డైలాగ్స్, సీన్స్, కెమెరా పనితనం ప్రతి ఒక్కటి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్నచిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె.నారాయణదాస్‌నారంగ్, పి.రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత సాయిపల్లవిపై నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ పాట తెరకెక్కించగా, దాంతో చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు. శేఖర్ కమ్ముల శైలి హంగులతో పాటు నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు.
టీజర్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రాన్ని నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. జాబ్ దక్కించుకునేందుకు కష్టపడే పాత్రలలో నాగ చైతన్య, సాయి పల్లవిలు అనుకోకుండా ప్రేమలో పడతారని తెలుస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా హృద్యంగా ఉంది. టీజర్‌ని చూస్తుంటే ఇది ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు.