Rashmika Mandanna : ఇండస్ట్రీ టాక్ : ఆ ఇద్దరు బిగ్ స్టార్స్ తో రష్మికా మందన్నా.!?

Rashmika Mandanna : తన కెరీర్ లో భారీ సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ఒకామె.
అయితే రష్మికా అందం అనేది పక్కన పెడితే ఆమె ఉంటే సినిమా ఆల్ మోస్ట్ హిట్ అనే సెంటిమెంట్ తోనే ఆమెని పలు భారీ సినిమాలకి ఎంపిక చేస్తున్నారన్నది సినీ వర్గాల్లో ఉన్న టాక్.
అలా ఇప్పటి వరకు మన తెలుగులో అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా అనేక మంది యంగ్ హీరోలు బిగ్ స్టార్స్ తో నటించిన ఈ హీరోయిన్ పుట్టినరోజు ఈరోజు కాగా.. ఈ స్పెషల్ డే నాడు ఇండస్ట్రీ వర్గాల నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్న ఈమె ఇప్పుడు తెలుగు మరియు తమిళ్ రెండు భాషల్లో కూడా మరో రెండు భారీ సినిమాలకి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
మరి ఆ హీరోల పేర్లు ఇంకా తెలియలేదు కానీ ఈ రెండు సినిమాలు మాత్రం భారీ సినిమాలు పైగా ఆ ఇద్దరు హీరోలు కూడా ఆ ఇండస్ట్రీలలో చాలా పెద్ద స్టార్లే అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
మరి ఆ హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏంటో అనేవి ముందు రోజుల్లో తెలుస్తుంది అని అంటున్నారు. మొత్తంగా అయితే ఈ యంగ్ హీరోయిన్ తన రేంజ్ ని ఓ రేంజ్ లో పెంచుకుంటూ వెళ్ళిపోతుంది.