ఇండస్ట్రీ టాక్ : స్యూర్ షాట్ హిట్ అవ్వబోతున్న “మేజర్” సినిమా.!

మన దేశం గర్వించదగ్గ సినిమాలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు అన్నే అంచనాలు రేకెత్తిస్తూ వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కూడా ఒకటుంది. ఆ సినిమానే “మేజర్”. యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా రియల్ హీరో సినిమా మంచి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి మన దేశం లో ఏ భాషలో కూడా లేని విధంగా థియేటర్స్ లో చాలా ముందే ప్రీమియర్ షో లు వేశారు.

తాజాగా నిన్న అయితే విశాఖపట్నం లో వేసి భారీ ప్రీమియర్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ఫలితం ఏమిటంటే.. ఈ ప్రీమియర్స్ టాక్ ప్రకారం అయితే స్యూర్ షాట్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా చాలా బాగుంది అని అన్ని భాషల్లో కూడా మంచి హిట్ అవుతుంది అని చెబుతున్నారు.

ముఖ్యంగా నిన్న వైజాగ్ లో ప్రీమియర్స్ అనంతరం మరింత పాజిటివ్ టాక్ ఈ సినిమాపై నెలకొంది. మొత్తానికి అయితే ఈ సినిమాకి మంచి రిపోర్ట్స్ ఇప్పుడు అందుతున్నాయి. ఇక జూన్ 3న వచ్చే సినిమాకి ఓవరాల్ గా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి. ఇంకా ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందించాడు.

అలాగే ఈ సినిమాలో అడివి శేష్ పక్కన గని ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా మహేష్ బాబు తన నిర్మాణ సంస్థ జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ మరియు సోనీ పిక్చర్స్ ఇండియా వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా ముంబై 2011లో జరిగిన బాంబు దాడులలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.