చాలా కాలం తర్వాత బహుశా మన తెలుగు స్టార్ హీరోలు అందులోని మన సీనియర్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ లు హీరోలుగా చేసిన చిత్రాలు “వీరసింహా రెడ్డి”, “మెగా 154” దాదాపు సమాన స్టామినా తో పోటీ పడనున్నాయి.
మరి ఈ భారీ చిత్రాలు గట్టి అంచనాలు నెలకొల్పుకోవడంతో పైగా రెండు కూడా సంక్రాంతి బరిలోనే దాదాపు దిగడం ఖరారు కావడంతో అభిమానుల్లో సినిమా వసూళ్ల ఉత్కంఠ చాలా ఎక్కువే నెలకొంది. దీనితో ఈ పోటీ అభిమానుల్లో పర్సనల్ గా మారుతున్నట్టుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాదు కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం బాలయ్య అభిమానులు మెగాస్టార్ 154వ సినిమాకి ఎక్కువ మొత్తంలో థియేటర్స్ దొరక్కుండా ప్లాన్ చేసుకుంటున్నారని. మేజర్ గా చాలా థియేటర్స్ అక్కడ తామే బ్లాక్ చేసుకుంటున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఇది ఎంతవరకు నిజమో కానీ సినీ వర్గాల్లో ఈ టాక్ నిజమే అని తెలుస్తుంది. ఇప్పుడు బాలయ్య స్టార్డం కూడా మళ్ళీ మెరుగవుతుంది చిరు వసూళ్లు పడిపోతున్నాయి. ఈ రెండు సినిమాల విషయంలో అయితే ఏం జరుగుతుందో ఏ సినిమాకి అత్యధిక వసూళ్లు వస్తాయో చూడాలి.