Indian Star Cricketer : హాట్ టాపిక్ : త్వరలో ఈ బాలీవుడ్ బ్యూటీని పెళ్లాడనున్న క్రికెటర్ కే ఎల్ రాహుల్.?

Indian Star Cricketer :  మన భారతదేశ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాల్లో టాప్ 3 స్థానాల్లో ఉండే వాటిలో ఒకటి సినిమా మరొకటి ఖచ్చితంగా క్రికెట్ అని చెప్పాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ రెండు భిన్నమైన క్యాటగిరీ లు కూడా అనేక సార్లు ఒకటైన సందర్భాలు ఉన్నాయి.

ఇండియా తరపున ఆడిన స్టార్ ప్లేయర్స్ ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న వారు ఉన్నారు అలాగే కొంతమంది స్టార్ ప్లేయర్ లు కొంతమంది హీరోయిన్స్ తో డేటింగ్ లో కూడా ఉన్నారు.

మరి అలా డేటింగ్ లో ఉన్న ఒక జంటనే త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని హాట్ టాపిక్ ఈ రెండు రోజులు నుంచి బాలీవుడ్ మరియు నేషనల్ మీడియాలో నడుస్తుంది. మరి ఆ స్టార్ క్రికెటర్ యంగ్ ప్లేయర్ కే ఎల్ రాహుల్ కాగా ఆ బాలీవుడ్ బ్యూటీ అథియా శెట్టి అని తెలుస్తుంది.

వీరిద్దరూ కూడా చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారు ఇప్పుడు ఒకరినొకరు మరింత అర్ధం చేసుకుని పెళ్లి వరకు వెళ్లాలని నిశ్చయించుకున్నారట. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉంది.