అదుపుతప్పి బోల్తా కొట్టిన కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ కారు .. తప్పిన పెనుప్రమాదం !

క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ కు తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్‌ కు గురైంది. రోడ్డుపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌ కుటుంబ సభ్యులు చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.కోటా మెగా హైవేలోని సుర్వాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Azharuddin accident : బోల్తా పడ్డ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కారు.. అజ్జూకి గాయాలు..

ఓవ‌ర్ ట‌ర్న్ కావ‌డం వ‌ల్ల కారు బోల్తా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. త‌న కుటుంబంతో క‌లిసి ర‌ణ్‌తంబోర్‌కు అజార్ వెళ్తున్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలిసింది. టైరు పేల‌డం వ‌ల్ల అజారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ధాబాలోకి కారు దూసుకువెళ్లింది. ధాబాలో ప‌నిచేస్తున్న ఇషాన్ అనే వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే క్రికెట‌ర్ అజార్ మ‌రో వాహ‌నంలో హోట‌ల్‌కు వెళ్లారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్థానిక పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.