మోస్ట్ అవైటెడ్ చిత్రం ఉంటుందట కానీ ఇప్పుడు కాదు

Indian 2 will resume after one year
Indian 2 will resume after one year
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈమధ్య పలు వివాదాలతో సతమవుతున్న సంగతి తెలిసిందే.  ‘ఇండియన్-2’ చిత్రంతో మొదలైన ఈ వివాదాలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. లైకా నిర్మాతలు శంకర్ చేత వేరే సినిమా చేయించకూడదని పట్టుబట్టి కూర్చోగా కోర్టు వారి పిటిషన్లను కొట్టివేసినట్టు తెలుస్తోంది. 
 
దీంతో శంకర్ ఫ్రీ అయిపోయినట్టే అంటున్నారు. అంటే ఆయన తన కొత్త సినిమాలు చేసుకోవచ్చన్నమాట. ప్రజెంట్ శంకర్ రామ్ చరణ్, దిల్ రాజు సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నారు.  ఈ చిత్రం మొదలైతే పూర్తికావడానికి కనీసం ఏడాది పడుతుంది. మరి సగం పూర్తైన ‘ఇండియన్ -2’ ముచ్చట ఏమిటి అంటే ఉంటుందట కానీ ఇప్పుడు కాదు. 
 
ఎందుకంటే శంకర్ సహా కమల్ హాసన్ సైతం వేరే సినిమా చూసుకుంటున్నారు. ఆయన ‘దృశ్యం-2’ తమిళ రీమేక్ మొదలుపెట్టి, నెల నుండి రెండు నెలల వ్యవధిలో ముగించి ఆతర్వాత వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ చిత్రాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. 
 
సో.. అటు శంకర్, ఇటు కమల్ ఇద్దరూ ఇంకో ఏడాది బిజీ అయిపోతారు.  వారు ఫ్రీ అయిన తర్వాతనే ‘ఇండియన్-2’ పట్టాలెక్కే వీలుంది. ఇప్పటికే ఈ సినిమాను బడ్జెట్ సమస్యలు, సెట్లో ప్రమాదాలు, నిర్మాత-దర్శకుడి మధ్య వివాదాలు, కీలక నటుడు వివేక్ కన్నుమూయడం లాంటి సమస్యలు బాగా వెనక్కు నెట్టాయి. ఇకపైన అయినా చిత్రం సజావుగా పూర్తయితే ఒక మంచి సినిమా మన ముందుకు వస్తుంది.