అదుపులో కరోనా.. 24 గంటల్లో 1549 కేసులే

దేశంలో కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో అదుపుులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కేసులు నమోదవ్వడం ఊరటనిస్తోంది. 24 గంటల దేశవ్యాప్తంగా 3.84లక్షల వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 1549మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయంది. పాజిటివిటీ రేటు 0.40శాతానికి పడిపోయింది. వైరస్ నుండి 2,652 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.74శాతానికి చేరింది. 31 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.