సమంత నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటీ సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘ఫ్యామిలీమెన్‌-2” వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువైన ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే ప్రకటనల ద్వారా నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని సమాచారం.

నెలకు మూడు కోట్లా..? అని ఆశ్చర్యపోకండి! సోషల్‌మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి.

ఈ వరుసలో సమంత ముందున్నది చెబుతున్నారు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ల్లో పలు బ్రాండ్‌లకు సంబంధించిన ప్రకటనలు జోరుగా కనిపిస్తున్నాయి.

యువతరంలో ఈ భామకున్న క్రేజ్‌ దృష్ట్యా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల కోసం భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నదని తెలిసింది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాల్లో నటిస్తున్నది.